దర్బంగా పేలుళ్లు: హైదరాబాద్‌లో హై అలర్ట్, స్లీపర్ సెల్స్‌పై నిఘా

By Siva KodatiFirst Published Jul 12, 2021, 6:47 PM IST
Highlights

దర్భంగా పేలుళ్ల మూలాలు హైదరాబాద్‌లో బయటపడటంతో మరోసారి తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. త్వరలో పండుగల సీజన్ మొదలవ్వడంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రానున్న పండగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కాగా, ఎన్‌ఐఏ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఒకరిని, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ-హైదరాబాద్‌ లింకులపై ఆరా తీస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తొయిబా స్లీపర్‌సెల్స్‌ను యాక్టివ్‌ చేసినట్లు.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

కాగా, దర్భాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు హైద్రాబాద్ కేంద్రంగా విచారణ జరుపుతున్నారు. నాసిర్, ఇమ్రాన్ సోదరులను బీహార్ నుండి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలను గుర్తించింది.

Also Read:ఆ అట్టముక్కలతో బ్లాస్ట్ ఆలస్యం, ఉగ్రవాదుల టార్గెట్ మిస్: దర్బాంగా ఘటనలో కీలక విషయాలు

దర్బాంగా పేలుడు ఘటనకు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వచ్చిన పార్శిల్ కారణంగా అధికారులు గుర్తించారు. ఈ దిశగా విచారణ జరిపిన సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని గుర్తించారు.రన్నింగ్ ట్రైన్ లో పేలుడు జరిగేలా ఇమ్రాన్, నాసిర్ సోదరులు ప్లాన్ చేశారు. అయితే పేలుడు పదార్ధాల అమర్చడంలో చేసిన పొరపాటుతో ఉగ్రవాదులు తాము నిర్ధేశించుకొన్న లక్ష్యానికి చేరుకోలేకపోయారు.

పేలుడు కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ లను ఉపయోగించారు. ఈ మూడు కలిస్తే పేలుడు వాటిల్లుతుంది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఇక్బాల్  ఆదేశాల మేరకు పేలుడు పదార్ధాలను తయారు చేశారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ల మధ్య చిన్న పేపర్ ముక్కలను వాడాల్సి ఉంది. ఈ మూడింటి మధ్య పేపర్ ముక్క వాడితే ట్రయల్స్ సమయంలో వీరు సక్సెస్ కాలేదు.  దీంతో  రైల్వే స్టేషన్ లో పంపే పార్శిల్ లో ఈ మూడు రసాయనాల మధ్య అట్టముక్కలు ఉపయోగించారు.

click me!