మర్రి శశిధర్ రెడ్డిపై బహిష్కరణ వేటు... టీపీసీసీ క్రమశిక్షణ కమిటీలో భగ్గుమన్న విభేదాలు

Siva Kodati |  
Published : Nov 20, 2022, 04:23 PM ISTUpdated : Nov 20, 2022, 04:28 PM IST
మర్రి శశిధర్ రెడ్డిపై బహిష్కరణ వేటు... టీపీసీసీ క్రమశిక్షణ కమిటీలో భగ్గుమన్న విభేదాలు

సారాంశం

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై బహిష్కరణ వేటు వ్యవహారం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు క్రమశిక్షణా కమిటీ సభ్యులు శ్యామ్ మోహన్. పార్టీలో మర్రి శశిధర్ రెడ్డికి తగిన గౌరవం దక్కలేదని శ్యామ్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీలో విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై బహిష్కరణ వేటు వేయడాన్ని తప్పుబట్టారు క్రమశిక్షణా కమిటీ సభ్యులు శ్యామ్ మోహన్. మర్రిని పార్టీ నుంచి బహిష్కరించడం తొందరపాటు నిర్ణయమని ఆయన అభివర్ణించారు. చిన్నారెడ్డి .. కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందని అంత తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. పార్టీలో మర్రి శశిధర్ రెడ్డికి తగిన గౌరవం దక్కలేదని శ్యామ్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని శనివారం బహిష్కరించారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనను బహిష్కరిస్తున్నట్టుగా తెలిపింది. బీజేపీ నాయకులు బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో ఆయనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బహిష్కరణ వేటు వేసినట్టుగా ప్రకటించింది. 

ALso Read:కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ..

ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా తెలిపింది. ఈ మేరకు టీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేసే కంటే ముందే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు మీడియా చిట్‌చాట్‌లో కూడా మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఇష్టం లేకపోయినా సరే కాంగ్రెస్‌ పార్టీని వీడి బయటకు వస్తున్నానని తెలిపారు. ఇందుకు సంబంధించి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.  

ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేది ఏం లేదని రేవంత్ రెడ్డి టార్గెట్‌గా వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడతారని అన్నారు. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!