బీఆర్ఎస్‌కు రాజీనామా .. మైనంపల్లి ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల సందడి, పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం

బీఆర్ఎస్ పార్టీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు శనివారం ఉదయం ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. 

congress leaders and activists at malkajgiri mla mynampally hanumanth rao residence ksp

బీఆర్ఎస్ పార్టీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది మాత్రం తెలియరాలేదు. కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ మైనంపల్లి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సందడి మొదలైంది. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు శనివారం ఉదయం ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి మైనంపల్లిని కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం నిరాకరించారు. ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్‌లో మల్కాజిగిరిలో మరొకరికి ఛాన్స్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి చోటు చేసుకోలేదు. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

Latest Videos

ALso Read: సస్పెన్స్‌కు చెక్.. బీఆర్ఎస్‌‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

సీనియర్ నేత కావడం, మెదక్, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పట్టుండటంతో మైనంపల్లి కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు గాలం వేస్తున్నాయి. అంగబలం , అర్ధబలం వున్న హనుమంతరావు తమ పార్టీలో చేరితే ప్రయోజనాలు మెండుగా వుంటాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అవసరమైతే మైనంపల్లి కోరినట్లుగా ఆయనకు , ఆయన తనయుడు రోహిత్‌కు టికెట్ ఇచ్చేందుుక రెండు పార్టీలు రెడీ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

vuukle one pixel image
click me!