కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి, ఆయన పూజారిగా బెటర్: వీహెచ్ ఫైర్

By Nagaraju penumalaFirst Published May 18, 2019, 2:54 PM IST
Highlights

అధికార దాహంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయనయి ఆరోపించారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు వీహెచ్. ప్రభుత్వం హాజీపూర్ దారుణలాపై మానవతా దృక్పథంతో కూడా స్పందించడం లేదని వీహెచ్ విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడిరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు నిప్పులు చెరిగారు. రెండోసారి అధికారంలోకి రావడంతో కేసీఆర్ కు అహం పెరిగిపోయిందన్నారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార దాహంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయనయి ఆరోపించారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు వీహెచ్.

ప్రభుత్వం హాజీపూర్ దారుణలాపై మానవతా దృక్పథంతో కూడా స్పందించడం లేదని వీహెచ్ విమర్శించారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థిక సహాయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. 

ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస పరిజ్ఞానం కేసీఆర్ కు లేదన్నారు. హాజీపూర్ లో బస్సు సౌకర్యం, వంతెన నిర్మాణంపై ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి తాము పోరాటం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. 

మరోవైపు ఉమ్మడిరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేవలం  తిరుపతి పూజారిగానే పనికొస్తాడంటూ సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్ ని పెడితే సెట్ అవుతారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ వినతిపత్రం ఇచ్చినా గవర్నర్ దాన్ని చెత్తబుట్టలో వేస్తున్నారంటూ వీహెచ్ ఆరోపించారు. 

click me!