కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విహెచ్ కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విహెచ్ కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. నేడు ఆయన గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తుండగా ఆయన కెమెరా కంటికి చిక్కారు.
72 సంవత్సరాల వయసులో ఆయన కరోనా నుండి కోలుకొని ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులకు అన్నారు. ఆయనతోపాటు ఆయన భార్య చంద్రకళ కూడా ఇంటికి చేరుకున్నారు. సాధారణంగా 65 సంవత్సరాలు పైబడ్డ వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
undefined
కానీ విహెచ్ మాత్రం తానింకా ఏమాత్రం యువకులకు తీసిపోలేదన్నట్టుగా అతి కొద్దీ కాలంలోనే పూర్తిగా కోలుకొని బయటకు వచ్చేసారు. చూడబోతుంటే ఆయన పీసీసీ అధ్యక్షుడి రేసులో మరోమారు ముందు వరుసలో పోటీ పడేలా కనబడుతున్నాడు.
ఆయన 21 జూన్ నాడు కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరాడు. ఒంట్లో బాగాలేదని ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు కరోనా లక్షణాల్లాగ అనిపించి వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఆరోజే ఆయన అక్కడ చేరిపోయారు.
కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ లో సరైన సమాచారం లేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.
కరోనా హెల్త్ బులెటిన్ విషయమై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా హెల్త్ బులెటిన్‌లో వార్డుల వారీగా సమాచారం లేదని హైకోర్టు ప్రశ్నించింది.
also read:కరోనా దెబ్బ: తెలంగాణలో డిగ్రీ ఆఢ్మిషన్స్ ప్రక్రియ వాయిదా
తమ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. కరోనా కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలను సమర్పించాలని కోరింది.కరోనా నిర్ధారణ పరీక్షలను నిలిపివేయడంపై కూడ కోర్టు అగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేంద్ర బృందం ఇటీవలే పర్యటించింది. అయితే ఈ బృందం నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలను సమర్పించాలని కూడ ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.
also read:సికింద్రాబాద్ కంటోన్మెంట్ హరితహరంలో కరోనా కలకలం: హోంక్వారంటైన్‌లో పలువురు
ఈ నెల 17వ తేదీ లోపుగా సమగ్ర సమాచారాన్ని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది . లేకపోతే ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది.