తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం సృష్టించింది. ఇంటర్ బోర్డులో 18 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఇప్పటికే ఇద్దరు కీలకమైన అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం సృష్టించింది. ఇంటర్ బోర్డులో 18 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఇప్పటికే ఇద్దరు కీలకమైన అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
ఇంటర్మీడియట్ బోర్డులో మిగిలిన ఉద్యోగులు కూడ కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు. ఇంటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు గత నెల 24 వ తేదీన కరోనా సోకింది. వీరిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.
undefined
ALSO READ:తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్‌పై ఎఫెక్ట్
ఇంబర్ బోర్డు పరీక్షల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు కూడ కరోనా సోకినట్టుగా సమాచారం. బోర్డులో పనిచేసే 18 మందికి ఇవాళ కరోనా నిర్ధారణ అయింది. మిగిలిన ఉద్యోగులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇంటర్ బోర్డులో ఒకే సారి పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇంటర్ కాలేజీల గుర్తింపు, ఆడ్మిషన్స్ తదితర కార్యక్రమాలపై కరోనా ప్రభావం పడే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 16,339కి చేరుకొన్నాయి. 24 గంటల వ్యవధిలోనే 945 కేసులు నమోదయ్యాయి.