రాహుల్‌తో భేటీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: అదే సమయంలో సోనియాతో వీహెచ్ భేటీ

Published : Apr 04, 2022, 06:22 PM IST
రాహుల్‌తో భేటీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు: అదే సమయంలో సోనియాతో వీహెచ్ భేటీ

సారాంశం

సోనియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు సోమవారం నాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. అదే సమయంలో తెంగాణకు చెందిన  కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ తో భేటీ అయ్యారు. సోనియాతో వి. హనుమంతరావు భేటీ కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.   

హైదరాబాద్: ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు Sonia Gandhiతో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత V.Hanumantha Rao సోమవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. 

సోనియాతో వి. హనుమంతరావు భేటీ అయిన సమయంలో AICC నేతలతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు Rahul Gandhi తో భేటీ కానున్నారు. తెలంగాన నేతలు రాహుల్ తో సమావేశమయ్యే సమయంలోనే హనుమంతరావు సోనియాతో సమావేశం కావడం రాజకీయంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

చాలా కాలంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కావాలని వి. హనుమంతరావు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా కాలంగా వీహెచ్ కు కాంగ్రెస్ అగ్ర నేతల అపాయింట్ మెంట్ లభించలేదు. గత మాసంలో కూడా ఢిల్లీకి వచ్చిన హనుమంతరావు  సోనియా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు.

 అయితే ఆ సమయలో ఆయనకు అపాయింట్ మెంట్ లభించలేదు.  అయితే గత శనివారం నాడు సోనియా అపాయింట్ మెంట్ కు సమయం ఇచ్చింది. ఢిల్లీలో ఉంటే శనివారం నాడు సోనియాను కలవాలని  హనుమంతరావుకు సమాచారం అందింది. కానీ ఆయన ఢిల్లీలో లేరు. దీంతో సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు వి. హనుమంతరావుకు కాంగ్రెస్ అధినేత్రి అపాయింట్ మెంట్ ఇచ్చింది.

 యాధృచ్చికంగా అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఎఐసీసీ కీలక నేతలు సమావేశం కానున్నారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ తో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి కూడా వి. హనుమంతరావుకు ఆహ్వానం అందింది. కానీ సోనియాగాంధీ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు హనుమంతరావు సోనియాతో భేటీ అయ్యారు.

వి. హనుమంతరాువతో పాటు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా సోనియాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను  హనుమంతరావు సోనియాగాంధీకి వివరించే అవకాశం ఉంది.

గత ఏడాదిలో హనుమంతరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ సమయంలో సోనియాగాంధీ వి. హనుమంతరావుకు ఫోన్ చేశారు.  ఈ ఫోన్ వచ్చిన తర్వాత హనుమంతరావు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.  పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై  వి. హనుమంతరావు సహా పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.  రేవంత్ రెడ్డి తీరును బహిరంగంగానే వి. హనుమంతరావు తప్పు బట్టారు. అయితే ఇటీవల మంత్రి హరీష్ రావును వి. హనుమంతరావు కలవడాన్ని రేవంత్ రెడ్డి వర్గం తప్పుబడుతుంది. అయితే తన కూతురు డాక్టర్ కావడంతో బదిలీ విషయమై మంత్రి హరీష్ రావును వి.హనుమంతరావు కలిస్తే తప్పేం ఉందని జగ్గారెడ్డి వి. హనుమంతరావు తరపున వకాల్తా పుచ్చుకున్నారు.

మొదటి నుండి పార్టీలో ఉన్నవారి విషయంలో రేవంత్ రెడ్డి వర్గం వ్యవహరిస్తున్న తీరును కూడా వి. హనుమంతరావు సోనియాకు వివరించే అవకాశం ఉంది.  పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై కూడా  హనుమంతరావు సోనియాతో చర్చించనున్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు తనకు వ్యతిరేకంగా  వ్యవహరించిన ఎపిసోడ్ ను కూడా హనుమంతరావు సోనియా వద్ద ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్