ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై: రేపు అమిత్ షా తో భేటీ

Published : Apr 04, 2022, 06:01 PM ISTUpdated : Apr 04, 2022, 06:14 PM IST
ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై: రేపు అమిత్ షా తో భేటీ

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. 

హైదరాబాద్: Telangana గవర్నర్  Tamilisai Soundararajan సోమవారం నాడు రాత్రి Delhiకి వెళ్లనున్నారు. మంగళవారం నాడు రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి  Amit Shah తో భేటీ కానున్నారు.  తెలంగాణ సీఎం KCR కు,  Governor తమిళిసై సౌందర రాజన్ మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగింది.ఈ తరుణంలో తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

Huzurabad అసెంబ్లీ ఎన్నికలకు ముందు  పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం., అయితే  కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి.,  ఆ తర్వాత  కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు.   అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

రాజ్ భవన్ లో Ugadi సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పలికింది. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు.  సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు.

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా కేసీఆర్ ప్రకటించారు.ఈ మేరకు తాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నానని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా పలు పార్టీలు, సీఎంలను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటును బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?