కారణమిదీ:ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వీహెచ్ మౌన దీక్ష

By narsimha lode  |  First Published Dec 6, 2022, 11:07 AM IST

ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత వి.హనుమంతరావు  మంగళవారంనాడు మౌన దీక్షకు దిగారు. పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని వీహెచ్  డిమాండ్  చేస్తున్నారు.


హైదరాబాద్: ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత  వి. హనుమంతరావు  మంగళవారంనాడు మౌన దీక్షకు దిగాడు. పంజాగుట్టలో కూల్చేసిన అంబేద్కర్  విగ్రహన్ని  అదే స్థలంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వీహెచ్  దీక్షకు దిగాడు.పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని తొలగించడంపై వి.హనుమంతరావు గతంలో కూడా  ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీ కేంద్రంగా  కూడా ఈ విషయమై వి.హనుమంతరావు దీక్ష చేశారు. హనుమంతరావు  దీక్షకు మద్దతుగా  ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్  కూడా  హనుమంతరావు దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు.ఇదే డిమాండ్ తో ఈ ఏడాది ఏప్రిల్  14న  ట్యాంక్ బండ్  అంబేద్కర్ విగ్రహం వద్ద వి.హనుమంతరావు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 

2019లో  పంజాగుట్టలోని  అంబేద్కర్ విగ్రహం తొలగింపు సమయంలో  అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. అంబేద్కర్  విగ్రహన్ని చెత్తవాహనంలో తరలించారు.ఈ విషయమై ఇద్దరు మున్సిపల్  సిబ్బందిని పోలీసులు అరెస్ట్  చేశారు.   పంజాగుట్టలో తొలగించిన స్థలంలోనే అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని  వీహెచ్ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ కూడా  ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద హనుమంతరావు నిరసనకు దిగారు.

Latest Videos

click me!