సంగారెడ్డి జిల్లా బిలాల్‌పూర్‌లో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

By narsimha lodeFirst Published Dec 6, 2022, 10:21 AM IST
Highlights

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బిలాల్ పూర్ లో  మంగళవారంనాడు భూమి కంపించింది. దీంతో  ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

హైదరాబాద్:సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం  బిలాల్ పూర్ లో  మంగళవారంనాడు తెల్లవారుజామున భూమి కంపించింది. దీంతో ప్రజలు  భయంతో  ఇళ్లలో నుండి  బయటకు పరుగులు తీశారు. ఇవాళ తెల్లవారుజామున 3:20 గంటల సమయంలో భూమి కంపించింది. భారీ శబ్దంతో  భూమి కంపించినట్టుగా  స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  గతంలో  భూకంపాలు చోటు చేసుకున్నాయి. రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో  2021 అక్టోబర్ 23న  భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతగా నమోదైంది.ఆదిలాబాద్  జిల్లాలోని ఈ ఏడాది అక్టోబర్  13న  భూకంపం సంబవించింది.మూడు సెకన్ల పాటు భూమి  కంపించింది.2021 నవంబర్ 1న తెలంగాణ రాష్ట్రంలోని  కుమరంభీమ్ జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. 

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగానే  చోటు  చేసుకుంటున్నాయి.ఈ ఏడాది నవంబర్  29న ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం వాటిల్లింది.2.5 తీవ్రతతో భూమి కంపించింది. అదే నెల 12న ఢిల్లీలో పలు చోట్ల భూ ప్రకంపనాలు చోటు  చేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో  ఈ ఏడాది నవంబర్  14న భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. 

click me!