
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అని అన్నారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ మాట్లాడే పద్దతి చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపించిందని అన్నారు. కేటీఆర్ జానెడంత లేడని.. ఆయన ఏం మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. కామారెడ్డిలో కేటీఆర్ వెళ్లే రోడ్లన్నీ మూసేశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను రాత్రికి రాత్రే అరెస్ట్‌లు చేశారని అన్నారు. కేటీఆర్ పర్యటనకు వస్తే తమను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాను చెప్పకున్నా కేటీఆర్‌ను జనం నిలదీశారని అన్నారు.
కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిందని కాంగ్రెస్సేనని అన్నారు. అలాంటి పార్టీని కేటీఆర్ ఏం పీకినావ్ అని మాట్లాడుతున్నాడని.. అలాంటి భాష తమకు రావాలంటే కష్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని.. కేసీఆర్ ఆయన కొడుకు ఇక్కడకు రాడని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ఏం పీకిందని మాట్లాడుతున్న కేటీఆర్..కాంగ్రెస్ ఏం పీకిందో కేసీఆర్‌ను అడగాలని అన్నారు.
హైదరాబాద్ ఓఆర్‌ఆర్ ఘనత కాంగ్రెస్‌దేనని.. అందుకే భూముల ధరలు పెరిగాయని.. వాటిలో కూడా బీఆర్ఎస్ నేతలు కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాకముందు కేటీఆర్‌కు ఇక్కడ ఉండటానికి ఇళ్లు లేదని.. ఇప్పుడు హైటెక్ సిటీలోప్రతి బిల్డింగ్‌కు 30 శాతం కమిషన్ అడుతున్నారని ఆరోపణలు చేశారు.
‘‘ఎగిరెగిరిపడకు కేటీఆర్.. మీకు ఇంకా 100 రోజులే మిగిలి ఉందని ’’ అని షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను తరిమికొట్టకుంటే తన పేరు షబ్బీర్ ఆలీనే కాదని అన్నారు. తనపై ఎవరు పోటీ చేసినా కామారెడ్డిలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.