హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి 4+4 భద్రతను కల్పించింది.
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి 4+4 భద్రతను కల్పించింది.
తనకు భద్రత కల్పించాలనే విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. సంఘ విద్రోహశక్తులతో తనకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు భద్రత ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపించిన హైకోర్టు రేవంత్ కు 4+4 భద్రతను కల్పించాలని మూడు రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు ఈమేరకు హైకోర్టు భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాల కాపీని బుధవారం నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అందించారు.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 4+4 గన్‌మెన్లను రేవంత్ రెడ్డికి గురువారం నాడు సమకూర్చారు.
4+4 గన్‌మెన్ సౌకర్యాన్ని రేవంత్‌కు గురువారం నాడు కల్పించారు. ఈ గన్‌మెన్లకు అయ్యే ఖర్చు ను రేవంత్ రెడ్డి మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత వార్తలు
రేవంత్‌కి భద్రతను పెంచమన్న హైకోర్టు.. కేంద్రానిదే బాధ్యత