కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

Published : Nov 01, 2018, 04:42 PM IST
కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

సారాంశం

మానవత్వానికి మచ్చి తెచ్చే దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. సమాజం తలదించుకునేలా కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.   

మానవత్వానికి మచ్చి తెచ్చే దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. సమాజం తలదించుకునేలా కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పహాడిషరీప్ ప్రాంతంలో నిరంజన్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి నివాసముండేవాడు. అయితే తాగుడుకు బానిసైన ఇతడు వావివరసలు మరిచి ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే కన్నేశాడు. బాలిక ను బెదరించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడేవాడు. దీంతో గర్భం దాల్చిన చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఈ అఘాయిత్యంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాధిత అమ్మాయికి పుట్టిన బాబు డీఎన్ఏ పరీక్ష ద్వారా నిందితున్ని గుర్తించారు. బాధితురాలి కన్న తండ్రే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి అతడిపై వివిధ సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద  కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఎల్బీ నగర్ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. 
 
PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే