కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

Published : Nov 19, 2018, 03:40 PM IST
కేసీఆర్ పై  రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

సారాంశం

కొడంగల్ తనను ఓడించేందుకు కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు కొడంగల్ సీటుకి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన ఆయన.. కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

కొడంగల్ తనను ఓడించేందుకు కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. మహాకూటమి, టీఆర్ఎస్ మధ్య జరగుతున్న పోరును కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో వందమంది ఉన్న కౌరవులు ఓడి.. ఐదుగురు ఉన్న పాండవులు గెలిచారని.. ఆ చరిత్రనే మహాభారతంగా చదువుకుంటున్నామన్నారు.

 అసెంబ్లీ ఎన్నికల్లో వంద మంది గెలుస్తారంటున్న కేసీఆర్.. కౌరవ వంశానికి చెందిన వారని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలోని ఐదు మండలాలను పంచపాండవులుగా అభివర్ణించిన రేవంత్... కొడంగల్‌లో జరగుతున్న కురుక్షేత్రంలో  తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?