టీఆర్ఎస్ కు షాక్...కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Nov 19, 2018, 3:26 PM IST
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి చేరుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల్లో టికెట్ల పంచాయితీ ముగిసినప్పటికి అసమ్మతుల అలక మాత్రం కొనసాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే యూసఫ్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధికార పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.  
 
కామారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ మైనారిటీ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యూసఫ్ అలీ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

ఈ చేరిక కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ...వక్ప్ బోర్డ్ మాజీ ఛైర్మన్ యూసఫ్ అలీ చేరికతో కామారెడ్డి జిల్లాలో  కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందన్నారు. కేవలం కామారెడ్డి మాత్రమే కాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జహిరాబాద్ ప్రాంతంలో యూసఫ్ కు మంచి పట్టుందన్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో కూడా యూసఫ్ చేరిక ప్రభావం ఉంటుందని షబ్బీర్ అలీ వెల్లడించారు. 

కాంగ్రెస్ సెక్యులర్ భావజాల ప్రభావం  కారణంగానే ఈ పార్టీలో చేరినట్లు యూసఫ్ అలీ స్పష్టం చేశారు. మైనారిటీల అభివృద్ది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.    
 
click me!