మోడీ, కేసీఆర్‌లను ఇంటికి పంపుతాం: రేణుకా చౌదరి

Published : Nov 24, 2018, 04:20 PM ISTUpdated : Nov 24, 2018, 04:21 PM IST
మోడీ, కేసీఆర్‌లను ఇంటికి పంపుతాం: రేణుకా చౌదరి

సారాంశం

 మోడీ, కేసీఆర్‌లను ఇంటికి పంపుతామని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి  చెప్పారు

ఖమ్మం: మోడీ, కేసీఆర్‌లను ఇంటికి పంపుతామని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి  చెప్పారు.ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు.

శనివారం నాడు ఖమ్మంలో ప్రజా కూటమి అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేత రేణుకా చౌదరి విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

కారు పార్టీ ఓ బేకార్ పార్టీ అంటూ  రేణుకా విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను ప్రజా కూటమి విజయం  సాధిస్తోందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు  ఈ కూటమి కొనసాగుతోందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

 రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నారు.కేసీఆర్ అవకాశవాదంతో ముందస్తు ఎన్నికలు వచ్చాయన్నారు.  నోట్ల రద్దు తర్వాత రూపాయి విలువ మరింత పడిపోయిందని చెప్పారు.  కొన్ని రాజకీయ విబేధాలు ఉన్నా కూటమి పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

‘‘కమ్మ ఓట్లు వద్దా’’.. టీపీసీసీపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

బిగ్‌పైట్: రేవంత్‌‌ రెడ్డిపై పట్నం అమీతుమీ

ఎన్నికల ఎఫెక్ట్..15రోజుల్లో మూడు పార్టీలు మారాడు

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం