వాపును చూసి బలుపు అనుకుంటుంది: బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఫైర్

Published : Aug 03, 2022, 10:18 PM IST
వాపును చూసి బలుపు అనుకుంటుంది: బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఫైర్

సారాంశం

వాపును చూసుకొని బీజేపీ బలుపు అనుకుంటుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం నాడు ఆయన కరీంనగర్ లో ఆయన  మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.


కరీంనగర్: వాపును చూసుకొని BJP బలుపు అనుకుంటుందని మాజీ ఎంపీ Ponnam Prabhakar చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 అసెంబ్లీ స్థానాల్లో  డిపాజిట్ రాలేదన్నారు.బుధవారం నాడు ఆయన Karimnagar లో మీడియాతో మాట్లాడారు.  Enforcement Directorate , CBI లను బిజెపి అనుబంధ సంస్థ గా మారుతుందన్నారు. తరచూ KCR అవినీతి గురించి మాట్లాడే బిజెపి నేతలు ఎందుకు ఆయన అవినీతి పై విచారణ జరపడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

Telangana కు వ్యతిరేకంగా ఉండే బిజెపి లో..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎలా వెళ్తారో చెప్పాలన్నారు. Munugode అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో Congress గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్  లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయన్నారు.మునుగోడులో టిఆర్ఎస్, బిజెపి డ్రామాలు ఆడుతున్నాయన్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే