కాళేశ్వరంపై రెండు రోజుల్లో గవర్నర్ కు ఫిర్యాదు: వైఎస్ షర్మిల

By narsimha lode  |  First Published Aug 3, 2022, 9:42 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై రెండు రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్ఆర్ టీపీ చీప్ వైఎస్ షర్మిల తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డిపై విచారణ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.ఈ విషయమై ఈఎన్సీకి ఆమె వినతి పత్రం సమర్పించారు 



హైదరాబాద్: Kaleshwaram ప్రాజెక్టు విషయమై  రెండు రోజుల్లో Governor ను కలిసి  ఫిర్యాదు చేస్తామని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ YS Sharmila ప్రకటించారు.ఇవాళ Hyderabad లోని తెలంగాణ నీటి పారుదల శాఖ ENC కార్యాలయం ముందు  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సహా ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన  మోటార్లు గోదావరి నది ముంపులో గురికావడంపై  వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయమై YSRTP తీవ్రంగా మండిపడింది. ఈ విషయమై బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో  తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ Muralidhar Rao కు ఫిర్యాదు చేసింది. 

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ నిర్వహించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ విచారణ నివేదిక వచ్చేవరకు  మెగా Krishna Reddy చేపట్టిన ప్రాజెక్టులన్నీ హోల్డ్ లో పెట్టాలని షర్మిల కోరారు.గత మాసంలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా కాళేశ్వరం మోటార్లు నీటిలో మునగిపోయాయి. ఈ విషయమై కాంట్రాక్టరే కారణమని  ఆమె ఆరోపించారు..

నాణ్యత లేని పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకొందని వైఎస్ఆర్ టీపీ ఆరోపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్  మెగా కృష్ణారెడ్డి నుండి వసూలు చేయాలని వైఎస్ఆర్ టీపీ డిమాండ్ చేసింది.మెగా కృష్ణారెడ్డిని ఎందుకు దోషిగా నిల‌బెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎందుకు ఆయ‌న నుంచి న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేయ‌డం లేదని అడిగారు. కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిలు  భాగ‌స్వాములుగా ఉన్నారని షర్మిల  గతంలోనే ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ముంపునకు గురి కావడం కూడా  డిజైన్ లోపమని  విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ విషయమై నిన్న కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిందన్నారు.

click me!