Uttam Kumar Reddy:కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తో ఉత్తమ్ భేటీ, సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ

Published : Dec 05, 2023, 11:39 AM ISTUpdated : Dec 05, 2023, 12:25 PM IST
Uttam Kumar Reddy:కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తో ఉత్తమ్ భేటీ, సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఇవాళ  కర్ణాటక డిప్యూటీ సీఎం  డీ.కే. శివకుమార్ తో భేటీ అయ్యారు.  ఇవాళ సాయంత్రం లోపుగా  సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది.దీంతో  ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ తో మంగళవారంనాడు  న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. మంగళవారంనాడు  ఉదయం  కాంగ్రెస్ సీనియర్ నేత నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు  న్యూఢిల్లీకి చేరుకున్నారు. 

న్యూఢిల్లీకి చేరుకున్న తర్వాత  కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్  తన సోదరుడి ఇంటికి చేరుకున్నారు. డీ. కే. శివకుమార్ సోదరుడి ఇంటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు.డీ.కే. శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో సీఎల్పీ నేత ఎంపిక విషయమై  చర్చిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో  మల్లు భట్టి విక్రమార్క న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

also read:Mallu Bhatti Vikramarka:లక్ష్మీపురం నుండి సీఎల్పీ నేతగా, పాదయాత్రతో పట్టు సాధించిన మల్లు భట్టి

గత అసెంబ్లీలో తాను  సీఎల్పీ నేతగా ఉన్న తనను ఈ దఫా కూడ  సీఎల్పీ నేతగా కొనసాగించాలని మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు.  కాంగ్రెస్ పార్టీని  ఎమ్మెల్యేలు వీడినా కూడ  పార్టీని కాపాడుకొనేందుకు తాను  చేసిన కృషిని కూడ  కాంగ్రెస్ నేత  మల్లు భట్టి విక్రమార్క  కాంగ్రెస్ నాయకత్వానికి వివరించారు.  తన పేరును సీఎల్పీ పదవికి ఎంపిక చేయాలని కోరుతున్నారు. 

also read:N.Uttam Kumar Reddy:యుద్ధభూమిలో శత్రువులపై పోరు: పైలట్ నుండి పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ప్రస్థానం

నిన్న సీఎల్పీ సమావేశానికి ముందుగానే  డీ. కే. శివకుమార్ తో  ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క ఓ హోటల్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశం నుండి  వీరంతా సీఎల్పీ జరిగే హోటల్ కు వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా డీ. కే. శివకుమార్ తో భేటీ కావడం చర్చకు దారి తీసింది.  సీఎల్పీ నేత ఎంపిక విషయమై  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.  ఇవాళ సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు.

also read:N.Uttam Kumar Reddy..నెరవేరిన శపథం: గడ్డం తీయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి  నేతలందరి సమిష్టి కృషి ఉందని  కాంగ్రెస్ సీనియర్లు కొందరు వాదిస్తున్నారు.ఏ ఒక్కరి వల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని వారు వాదిస్తున్నారు.  ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని  సీఎల్పీనేతను ఎంపిక చేయాలని కోరుతున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?