పరువు నష్టం దావా వేస్తా: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాణికం ఠాగూర్ లీగల్ నోటీస్

By narsimha lodeFirst Published Jul 10, 2021, 8:37 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో మాణికం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి  రూ. 25 కోట్లిచ్చారనే ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ నేత ఠాగూర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల మధ్య రేవంత్ ను విమర్శించే క్రమంలో సుధీర్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు.ఈ విషయమై క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. 


హైదరాబాద్: ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎఐసీసీ ఇంచార్జీ మాణికం ఠాగూర్ శనివారం నాడు లీగల్ నోటీసులు పంపారు.తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు.  ఈ విషయమై పరువు నష్టం దవా వేస్తానని అడ్వకేట్ నుండి నోటీసులు పంపారు.  వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆయన తేల్చి చెప్పారు.

టీపీసీసీ చీఫ్  పదవి కోసం రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మాణికం ఠాగూర్ కు రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ దక్కించుకొన్నారని ఆయన విమర్శించారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు సమాధానమిస్తూ సుధీర్ రెడ్డి  మాణికం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి  డబ్బులు ఇచ్చారన్నారు.కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేయాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. తాము రాజ్యాంగపరంగానే టీఆర్ఎస్ లో విలీనమైనట్టుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి విమర్శలకు ఎదురుదాడి చేస్తున్నారు.

 

click me!