
హైదరాబాద్: TRSతో కాంగ్రెస్‌తో పొత్తు అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Manickam Tagore చెప్పారు. ఆదివారం నాడు హైద్రాబాద్ లో మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. BJP , TRS పై పోరాటంలో వెనక్కి తగ్గబోమని ఆయన చెప్పారు. మే మాసంలో జరిగే రాహుల్ గాంధీ సభ ద్వారా మా సత్తాను చాటుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో మాణికం ఠాగూర్ వరుసగా రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితితో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలపై చర్చించారు. ఠాగూర్ ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు నేతలు ఆలస్యంగా రావడంపై కూడా ఆయన మండిపడ్డారు వరుసగా మూడు సమావేశాలకు రాకపోతే హైకమాండ్ తో చర్చించి పార్టీ పదవుల నుండి కూడా తప్పిస్తామని ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు. మే మాసంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.ఈ టూర్ ను విజయవంతం చేయడంపై కూడా పార్టీ నేతలతో ఠాగూర్ చర్చించారు.
ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య బేదాభిప్రాయాల విషయమై ప్రస్తావించారు. అయితే తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్తగా సునీల్ ను నియమించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నాయకత్వానికి సునీల్ టీమ్ దిశానిర్ధేశం చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులు TRS, BJP, కాంగ్రెస్ తో పాటుఇతర పార్టీల స్థితిగతులపై సునీల్ ఇప్పటికే రాహుల్ గాంధీకి నివేదికను ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్రానికి చెందిన నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సమయంలో ఈ నివేదిక ఆధారంగా పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో వీలైనన్నీ ఎక్కువ సార్లు పర్యటిస్తానని కూడా రాహుల్ ఈ సందర్శంగా పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.