భువనగిరి పరువు హత్య : 13 మంది అరెస్ట్.. నేరం అంగీకరించిన సుపారీ కిల్లర్ లతీఫ్

Siva Kodati |  
Published : Apr 17, 2022, 02:37 PM IST
భువనగిరి పరువు హత్య : 13 మంది అరెస్ట్.. నేరం అంగీకరించిన సుపారీ కిల్లర్ లతీఫ్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భువనగిరి పరువు హత్య కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామ రామకృష్ణ ఆదేశాలతోనే తాము లతీఫ్‌ను అరెస్ట్ చేశామని లతీఫ్ గ్యాంగ్ నేరం అంగీకరించింది.   

భువనగిరి పరువు హత్య కేసులో (bhongir honor killing) 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు లతీఫ్ నేరం అంగీకరించాడు. రామకృష్ణను హత్య చేసేందుకు అతని మామ సుపారీ ఇచ్చినట్లు తెలిపాడు. నెల రోజులుగా రామకృష్ణపై నిఘా పెట్టినట్లు లతీఫ్ పోలీసులకు చెప్పాడు. హైదరాబాద్‌లో ఫ్లాట్స్ చూపించాలని ట్రాప్ చేసినట్లు వెల్లడించాడు. రామకృష్ణను నమ్మించేందుకు కొంత నగదును అకౌంట్‌లో వేసినట్లు తెలిపాడు. హత్య చేసి సిద్ధిపేటలో శవాన్ని పడేసింది లతీఫ్ గ్యాంగ్. గతంలో రామకృష్ణ మామ వెంకటేశ్ దూషించడంతో అతని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. Siddipet జిల్లాలో Ramakrishna మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.

యాదగిరిగుట్టకు (yadadri) చెందిన భార్గవిని, వలిగొండ మండలం లింగరాజుపల్లెకు చెందిన  రామకృష్ణ 2020 ఆష్టు 16న ప్రేమ వివాహం చేసుకొన్నాడు. స్వంత గ్రామం లింగరాజుపల్లెలోనే భార్యతో రామకృష్ణ నివాసం ఉన్నాడు. అయితే భార్గవి గర్భవతి కావడంతో తరచూ ఆసుపత్రికి వెళ్లడానికి వీలుగా తన నివాసాన్ని భువనగిరికి మార్చాడు. 

ఇటీవలనే భార్గవి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  తుర్కపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ కు గురయ్యారు. దీంతో రామకృష్ణ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.  అయితే రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను లతీఫ్ అనే రౌడీషీటర్ భూమిని చూపించాలని పిలిపించి హత్య చేశారని  మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.  రామకృష్ణ మామ  వెంకటేష్ సూచనలతో లతీఫ్ అతని గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. 

నెల రోజులుగా రామకృష్ణపై లతీఫ్ నిఘా

రామకృష్ణపై లతీఫ్  నెల రోజులుగా నిఘాను ఏర్పాటు చేశారు.  ప్లాట్ కొనుగోలు చేస్తానని లతీఫ్  రామకృష్ణను నమ్మించాడు. ఈ విషయమై కొంత నగదును కూడా రామకృష్ణకు లతీఫ్ పంపాడు.  దీంతో ఫ్లాట్ చూపిస్తానని రామకృష్ణ చెప్పారు. రామకృష్ణను హైద్రాబాద్ పిలిపించి కిడ్నాప్ చేసి రామకృష్ణను లతీఫ్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  లతీఫ్ ద్వారా రామకృష్ణను  చంపేందుకు వెంకటేష్ సుఫారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్