రోజా ఇంట్లో జగన్, కేసీఆర్ రహస్య ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

By AN TeluguFirst Published Jul 6, 2021, 2:38 PM IST
Highlights

సీఎం కేసీఆర్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలను జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.  

సీఎం కేసీఆర్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలను జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.  

2015లో జూన్, 18, 19 తేదీల్లో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలమీద తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీష్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీార్, చంద్రబాబులు మాట్లాడుకున్నారు. 

299 టీఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? 811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని 12.5.2020న రజత్ కుమార్ లేఖ రాశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్. 

రోజా ఇంటికి వెళ్లినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది. 203 జీవో మే 5న జారీ చేస్తే మొదట స్పందించింది మేమే. గతేడాది మే 11న దీని మీద కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసింది నేనే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల మీద మే 12న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీఎస్ తో లేఖ రాయించారు.

మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర జలశక్తి కేఆర్ఎంబీని ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేల చూడాలని కోరింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేయగలారా? మే నెల మొత్తం లేఖల ద్వారా హెచ్చరించినా ఆగస్టులో పనులు జరుగుతున్నాయని తెలిసినా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారు. కొత్త డ్రామాలకు తెరలేపి.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలోనే ఒప్పందం జరిగింది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

click me!