ఖర్గే వద్దే తేల్చుకుంటా: షోకాజ్ నోటీసులపై మహేశ్వర్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Apr 12, 2023, 2:54 PM IST

షోకాజ్ నోటీసులు  ఇవ్వడంపై  ఎఐసీసీ  కార్యక్రమాల  అమలు కమిటీ   చైర్మెన్  మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.  ఈ విషయమై  పరోక్షంగా  రేవత్ రెడ్డి పై  మండిపడ్డారు. 
 


హైదరాబాద్: తనకు  షోకాజ్  నోటీసు  ఇవ్వడంపై   ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గేని కలిసి  తేల్చుకుంటానని   కాంగ్రెస్  నేత  మహేశ్వర్ రెడ్డి  చెప్పారు. టీపీసీసీ  నుండి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై  మహేశ్వర్ రెడ్డి  స్పందించారు.  బుధవారంనాడు  ఆయన   హైద్రాబాద్ లో మీడియాతో మాట్లడారు.  తనకు  షోకాజ్  ఎందుకు  ఇచ్చారో రేపటి లోపుగా   వివరణ  ఇవ్వాలని  ఆయన డిమాండ్  చేశారు 

పీఏసీలో   తాను  ఉండడం ఇష్టం లేకపోతే  రాజీనామా చేస్తానని ప్రకటించారు.  పార్టీ మారుతానని  తాను  ఎక్కడా  చెప్పలేదన్నారు.  తాను  వివరణ ఇవ్వాల్సిన  అవసరం లేదన్నారు. క్రెడిబులిటీ  లేని వాళ్లు  తనకు   నోటీసులు  ఇచ్చాదని  పీసీసీ నాయకత్వంపై  మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.  బ్లాక్  మెయిల్  చేసి పార్టీ మారిన వ్యక్తిత్వం  తనది కాదని పరోక్షంగా  రేవంత్ పై  ఆయన  విమర్శించారు.  తన విషయలో పీసీసీ  ఏ నిర్ణయం తీసుకున్నా  ఇబ్బంది లేదన్నారు. 

Latest Videos

also read:మహేశ్వర్ రెడ్డికి షాక్: షోకాజ్ ఇచ్చిన కాంగ్రెస్

తనకు  కారణం లేకుండా  నోటీస్  ఇస్తారా అని  ఆయన  ప్రశ్నించారు. తాను  పార్టీ వ్యతిరేక  కార్యక్రమాలు  చేయలేదని  మహేశ్వర్ రెడ్డి  స్పష్టం  చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డిపై  బహిరంగంగా  కూడా ఆరోపణలు చేయలేదని  ఆయన గుర్తు  చేశారు. ఎథిక్స్ తో  రాజకీయాలు చేసినట్టుగా  మహేశ్వర్ రెడ్డి  చెప్పారు.  కొత్తగా పార్టీలోకి వచ్చిన  వ్యక్తకులకు  రూల్స్  తెలియవన్నారు. ఎఐసీసీ  కార్యక్రమాల  కమిటీ  అమలు  చైర్మెన్ గా  ఉన్న తనకు  పీసీసీ  ఎలా   షోకాజ్  నోటీసులు  ఎలా ఇస్తారని  ఆయన ప్రశ్నించారు. 

click me!