కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

By narsimha lodeFirst Published Sep 21, 2018, 3:44 PM IST
Highlights

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది

హైదరాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది

కాంగ్రెస్ పార్టీ కమిటీలపై  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది.ఈ మేరకు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీలపై  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.  పార్టీ అధిష్టానం తీరును తప్పుబట్టారు.

కొందరు నేతలు ఈ కమిటీలపై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేదు. వీరిద్దరూ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొంది.

శుక్రవారంనాడు  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోదండరెడ్డి అధ్యక్షతన హైద్రాబాద్‌లో సమావేశమైంది.  ఈ సమావేశంలో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై  చర్చించారు.  రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను కూడ పార్టీ నేతలు పట్టించుకోకపోవడంపై  క్రమశిక్షణ సంఘం  అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ తరుణంలో పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై  పార్టీ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులను పంపింది. అంతేకాదు రెండు రోజుల్లోపుగా సమాధానం ఇవ్వాలని  క్రమశిక్షణ సంఘం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!
Last Updated Sep 21, 2018, 3:56 PM IST
click me!