
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. తనను వదిలివెళ్లిన నాయకులను తిరిగి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2014 నుంచి కాంగ్రెస్ ను విడిచి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఘర్ వాపసీ కార్యక్రమం చేపడుతున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ గతంలో మాదిరిగా బలంగా చేయడం పైనే ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది.
2014 ముందు వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చాలా బలమైన పార్టీగా కూడా ఉంది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బలహీన పడింది. రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. అలాగే రెండో స్థాయి కేడర్ కూడా టీఆర్ఎస్ లోకి వచ్చేసింది. అయితే ఇప్పటికీ కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టీఆర్ఎస్ తరువాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నారని తాజా సర్వేలు కూడా తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్నే ఆ పార్టీ ఇప్పుడు సానుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
నాన్నమ్మ, మనవడిని చంపి.. ఏమీ తెలీనట్టు తాపీగా హత్యాస్థలానికి వచ్చి..
2014 ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి విడిపోయిన నాయకులను తీసుకొస్తే, కింది స్థాయి క్యాడర్ బలంతో తిరిగి పుంజుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే తమ పార్టీలో ఒకప్పుడు యాక్టివ్ గా ఉండి, టీఆర్ఎస్ లోకి వెళ్లి అక్కడ సంతృప్తిలో లేని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సొంత గూటికి తెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. దాని కోసం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ని పార్టీలోకి జాయిన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. నిన్న ఆయన తిరిగి తన పార్టీలోకి చేరారు. ఆయన తో పాటు పక్కనే ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం మానకొండూర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న నాయకుడు ఆరేపల్లి మోహన్ కూడా కాంగ్రెస్ గూటిలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఉన్న టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా తిరిగి కాంగ్రెస్ లో చేరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ను విడిచి వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ లలో ఒకరు చొప్పున తిరిగి పార్టీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇది త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లో ఉండి అసంతృప్తిగా ఉన్న మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రేపో మాపో వారు కూడా తిరిగి ‘హస్తం’లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. పార్టీలోకి పాత నాయకులు చేరుతుంటే కాంగ్రెస్ నే అంటిపెట్టుకొని ఉన్న ఆ జిల్లా నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. హుస్నాబాద్‌లో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరడంతో పార్టీకి చెందిన ఓపెన్ గానే తన అసహనాన్ని ప్రదర్శించారు. మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్త చేస్తున్నట్టు సమాచారం. అయితే వీరందరిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని నచ్చచెపుతున్నట్టు సమాచారం. పార్టీకి గతంలా పుంజుకోవాలంటే కొంత సంయమనం పాటించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.