సర్కారీ దవాఖానాలో వైద్య సేవలు బాగున్నాయని.. తాను పెద్దగా చదువుకోలేదని, కానీ నూటికి నూరు మార్కులు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పిన సమాధానానికి మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు (harish rao) ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వుంటారన్న సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖాలను తీసుకొచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో మంగళవారం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా అక్కడి సదుపాయాలు, వైద్యులు, అధికారుల పనితీరును ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన బిడ్డ ప్రసవం కోసం మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఓ పెద్దావిడను హరీశ్ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి ప్రశ్నించారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకం సాయంతో ఘనంగా పెళ్లి చేశామని, తర్వాత మనుమరాలు ఈ ఆసుపత్రిలోనే పుట్టిందని చెప్పారు. మరి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావని హరీశ్ రావు ప్రశ్నించగా.. తాను చదువుకోలేదని, కానీ ఇక్కడి వైద్య సేవలకు వందకు వంద మార్కులు వేస్తానని వృద్ధురాలు చెప్పడంతో హరీశ్ రావు సహా అక్కడున్న నేతలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెకు కేసీఆర్ కిట్ ను అందజేశారు మంత్రి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
undefined