
హైదరాబాద్: Kaleshwaram Project ప్రాజెక్ట్ భూసేకరణపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం నాడు ఆదేశించింది.
కాళేశ్వరం భూసేకరణపై దాఖలైన పిటిసన్లపై బుధవారం నాడు Supreme Court విచారణ నిర్వహించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాళేశ్వరం భూసేకరణ విషయమై యథాతథస్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం Counter దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.