కాంగ్రెస్‌‌లో టికెట్ల లొల్లి...టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Nov 16, 2018, 6:20 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుండి రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మహాకూటమిని దెబ్బతీసేందుకు ఆ పార్టీ నాయకత్వం సిద్దమైంది. అందుకోసం కాంగ్రెస్ అసంతృప్తులను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటూ మరింత బలాన్ని పెంచుకుంటోంది. 

ఇలా కాంగ్రెస్‌  పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ మంచిర్యాల కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులతో చర్చించిన తర్వాత అరవింద్ ప్రగతి భవన్‌లో గులాబీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈయన చేరికతో మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.. 

ఇంకా చాలామంది కాంగ్రెస్ అసమ్మతి నేతల తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మహా కూటమి ఓటమి కోసం వారందరిని కలుపుకుపోయి మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.  

click me!
Last Updated Nov 16, 2018, 6:24 PM IST
click me!