ఆ విషయం కేసీఆర్ కే తెలియదు:చంద్రబాబు

By Nagaraju TFirst Published Nov 16, 2018, 5:09 PM IST
Highlights

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కేసీఆర్ నన్ను తిట్టమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ కే తెలియదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా ముందస్తుకెళ్లడం సరికాదన్నారు.
 

అమరావతి: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కేసీఆర్ నన్ను తిట్టమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ కే తెలియదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా ముందస్తుకెళ్లడం సరికాదన్నారు.

వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేసీఆర్ లు ముగ్గురు బీజేపీకీ మేలు చేసేందుకే ఉన్నారన్నారు. ఏపీకి తీరని ద్రోహం చేసిన బీజేపీకి వీరంతా అండగా నిలుస్తున్నారన్నారు. ముగ్గురు నేతలు తనను తిట్టమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయాలు స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం చెయ్యాలని సూచించారు. 

తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని ఏపార్టీ చెయ్యని విధంగా బీసీలకు పెద్ద పీట వేసిందన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకునేలా బీసీలు ఎదగాలని ఆకాంక్షించారు. బీసీల్లో నాయకత్వం ఎదగకుంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతాయన్నారు.

ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై పోరాటానికి పార్టీలకు అతీతంగా అంతా టీడీపీకి అండగా ఉండాలని చంద్రబాబు కోరారు. తాను బెదిరింపులకు భయపడే వాడిని కాదని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పోరాడటమే టీడీపీ విధానమన్నారు. 

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తనకు ఉందని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను తిరుగులేని శక్తిగా రూపొందిస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన ద్రోహంతో 40ఏళ్లు వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో జట్టుకట్టాల్సి వస్తోందన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలన్నీ వికటించాయని, నోట్ల రద్దు వల్ల ఎన్నో లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

click me!