ఆ నాయకులే టికెట్లు అమ్ముకుంది: బోడ జనార్ధన్ సంచలనం

By Arun Kumar PFirst Published Nov 16, 2018, 5:30 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఆ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నాయకులంతా కలిసి తెలంగాణ రెబల్స్ ప్రంట్ పేరుతో ఒక్కటయ్యారు. ఈ ప్రంట్ లో భాగస్వామ్య సభ్యులందరితో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించనున్నట్లు మాజీ మంత్రి బోడ జనార్ధన్ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
 
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క, ఇంచార్జి కుంతియాలు కలిసి సిండికేట్ గా ఏర్పడ్డారని జనార్ధన్ తెలిపారు. ఈ సిండికేట్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుని బలహీనంగా వున్న నాయకులకు కూడా టికెట్లిచ్చిందని ఆరోపించారు. ఇలా  పార్టీలో కొత్తగా చేరిన 19 మందికి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు క్యామ మల్లేష్ బైటపెట్టిన ఆదారాలే ఉదాహరణగా జనార్ధన్ పేర్కొన్నారు. 

టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరగడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  పస్ట్ లిస్ట్ కోసం 3 నెలలు జాప్యం జరిగినప్పుడే తమకు అనుమానం వచ్చిందన్నారు. డబ్బులున్న వాళ్లకు సీట్లు అమ్ముకోడానికే అభ్యర్థుల ఎంపిక ఆలస్యం చేశారని ఆరోపించారు. 

ప్రస్తుతం ఏర్పడిన రెబల్స్ ప్రంట్ తరపున కామన్ సింబల్ పై ఎన్నికల్లో పోటీ  చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 40 మంది అభ్యర్థుల ఈ ప్రంట్ తరపున పోటీకి  దిగనున్నారని...వీరంతా 19వ తేదీ లోపు నామినేషన్ వేస్తారని వివరించారు. తమతో ఇంకా తెలుగు దేశం, టీజేఎస్, టీఆర్ఎస్ రెబల్ నేతలు టచ్ లో ఉన్నారని వెల్లడించారు. తమ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని జనార్ధన్ తెలిపారు. 

click me!