లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక: పోటీకి కాంగ్రెస్ సై

Published : Apr 20, 2021, 02:13 PM IST
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక: పోటీకి కాంగ్రెస్ సై

సారాంశం

జీహెచ్ఎంసీ పరిధిలోని  లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  ఇవాళ తమ పార్టీ అభ్యర్ధికి బీ ఫామ్  అందించనుంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని  లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  ఇవాళ తమ పార్టీ అభ్యర్ధికి బీ ఫామ్  అందించనుంది.గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి  ఎన్నికలు జరిగియి. ఈ ఎన్నికల్లో  లింగోజిగూడ  డివిజన్ నుండి బీజేపీ అభ్యర్ధిగా ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు.  ప్రమాణం చేయకముందే  ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో  ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.  

ఈ స్థానం నుండి  పోటీ చేయవద్దని  బీజేపీ నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని  బీజేపీ నేతలు  కేటీఆర్ ను కోరారు. ఈ విషయమై కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడ ఇదే విషయమై కోరారు. 

అయితే ఈ స్థానం నుండి పోటీ చేస్తామని మంగళవారం నాడు  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అనుమతి లేకుండా ఈ విషయమై కేటీఆర్ ను కలవడంపై కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం  సీరియస్ అయింది.  ఈ విషయమై  ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ  రేపటిలోపుగా నివేదిక అందించనుంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?