భువనగిరి జిల్లాలో దారుణం... ఆకతాయి వేధింపులకు మైనర్ బాలిక బలి

Arun Kumar P   | Asianet News
Published : Nov 23, 2021, 10:01 AM ISTUpdated : Nov 23, 2021, 10:13 AM IST
భువనగిరి జిల్లాలో దారుణం... ఆకతాయి వేధింపులకు మైనర్ బాలిక బలి

సారాంశం

ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వెంటపడి వేధించడాన్ని తట్టుకోలేక ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. 

భువనగిరి: ఓ ఆకతాయి వేధింపులను తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో స్నేహితులను వెంటేసుకుని ఓ ఆకతాయి వెంటపడుతూ వేధిస్తుండటాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  

వివరాల్లోకి వెళితే... yadadri bhuvanagiri district మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన దుర్గాభవాని(17) భువనగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఈ యువతి ఇంటిపక్కనే వుండే గురజాల ఏలేందర్ ప్రేమ పేరిట వెంటపడేవాడు. అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో స్నేహితులతో కలిసి యువతి వెంటపడుతూ వేధించేవాడు.  గతంలో ఈ వేధింపులను తట్టుకోలేక యువతి తన తండ్రి బట్టు రాజమల్లుకు  విషయాన్ని తెలియజేసింది. 

దీంతో అతడు గ్రామ పెద్దలకు తన కూతురిని పక్కింటి కుర్రాడు వేధిస్తున్న విషయాన్ని తెలియజేసి పంచాయితీ పెట్టాడు. గ్రామ పెద్దల ముందు ఇకపై యువతి వెంటపడనని ఒప్పుకున్న ఏలేశ్వర్ కొంతకాలం హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. అక్కడే ఏడాదిపాటు పనిచేసుకుంటూ వున్నాడు.   

read more  Telangana Unemployment: మంత్రి కేటీఆర్ ఇలాకాలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

అయితే ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చిన ఏలేశ్వర్ మళ్లీ దుర్గాభవానిని వేధించసాగాడు. ఆమె ఫోన్ నెంబర్ ను సంపాదించిన అతడు నిత్యం ఫోన్ చేస్తూ తనను ప్రేమించాలంటూ బెదిరించసాగాడు. ఇటీవల అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో యువతి తట్టుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుర్గాభవాని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన యువతి కోలుకున్నట్లే కోలుకుని మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో మరింత మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దుర్గాభవాని మృతిచెందింది. 

దుర్గాభవాని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. తన కూతురి ఆత్మహత్యకు కారణమంటూ ఏలేశ్వర్ తో పాటు అతడి స్నేహితులు మరో ఏడుగురిపై రాజమల్లు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కానీ యువతి ఆత్మహత్య విషయం తెలియగానే ఈ యువకులంతా గ్రామాన్ని వీడి పరారీలో వున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడితో పాటు అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

read more  Telangana Unemployment: మంత్రి కేటీఆర్ ఇలాకాలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు మాత్రం రక్షణ దక్కడంలేదు. ఒంటరిగా యువతి కనిపించిందంటే చాటు ఆకతాయిలు వెంటపడి వేధింపులకు దిగుతున్నారు. హైదరాబాద్ లో షీ టీమ్ లు మహిళల రక్షణ విషయంతో ఎంత సమర్ధవంతంగా పనిచేసినా ఎక్కడో ఒకచోట మహిళలు వేధింపులకు గురవుతూనే వున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులే మితిమీరి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. భువనగిరి జిల్లాలో దుర్గాభవాని ఆత్మహత్య కూడా ఇలాంటిదే. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి.)


 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?