ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా కొనసాగాలని కోరుకుంటున్నారు.. బీఆర్ఎస్ టికెట్ పై ఇంకా ఆశ వీడలేదు...

By SumaBala Bukka  |  First Published Oct 10, 2023, 6:45 AM IST

ప్రజలు తనను ఎమ్మెల్యేగానే కొనసాగాలని కోరుకుంటున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కడంపై ఇంకా ఆశాజనకంగానే ఉన్నానన్నారు.


హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఇప్పటికీ ఆశాజనకంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. స్థానికంగా ప్రజాభిమానం తనకే ఉందన్నారు. ఈ విషయం అధిష్టానానికి సర్వేలు నివేదికల ద్వారా తెలుస్తుందని.. వారు తమ నిర్ణయం మార్చుకుంటారని ఆశావహంగా ఉన్నట్లు తెలిపారు.

రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నాపై నమ్మకం ఉంది. అందుకే నన్ను రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్గా నియమించారు. దీనికి నేను ఎంతో కృతజ్ఞుడిని. దీనికి కృషి చేసిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావుకు ధన్యవాదాలు’ అన్నారు.

Latest Videos

Amit Shah: నేడు తెలంగాణ కు రానున్న అమిత్ షా.. పలు కీలక హామీలు.. నేతలకు దిశా నిర్థేశం..

ముఖ్యమంత్రి ఆదేశాలకు  అనుగుణంగా పని చేస్తానన్నారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వారి భాగోగుల కోసం పనిచేస్తానని  చెప్పుకొచ్చారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా  కొనసాగాలని కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో నెలకొని ఉన్న ప్రజాభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు తాటికొండ రాజయ్య.  సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఇప్పటికీ నేను విధేయుడిగానే ఉన్నానని రాజయ్య చెప్పుకొచ్చారు. 

click me!