హుజురాబాద్ ఉపఎన్నికల బరిలోకి దిగారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్. ఇవాళ నామినేషన్ వేసిన ఆయన మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరాడు.
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో భాగంగా గతవారం రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. దీంతో చివరిరోజయిన ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలని భావిస్తున్న అభ్యర్థులంతా ఇవాళే నామినేషన్ వేసారు. ఇలా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేసారు.
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లిన balmoor venkat రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వెంకట్... తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగీ తరుపున పోరాడతానన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని అన్నారు.
undefined
వీడియో
''తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులను ఎదుర్కొన్నాను. ఒక మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాగలరని హుజురాబాద్ ప్రజలను పేరుపేరున కోరుతున్నాను'' అని వెంకట్ అన్నారు.
read more పార్టీ కోసం కష్టపడితే ఇంటికే బీ ఫాంలు: రేవంత్ రెడ్డి
ఇవాళ నామినేషన్ తర్వాత ప్రజల్లోనే వుండాలని వెంకట్ నిర్ణయించుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ వెంకట్ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. ఇలా హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచే దిశగా ప్రచార జోరు పెంచుతున్నారు.
huzurabad bypoll నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన గత శుక్రవారమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసారు. ఇవాళ కూడా మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కూడా ఆయన ఇవాళ రిటర్నింగ్ అధికారికి అందించారు. ఇక బిజెపి తరపున ముందుజాగ్రత్తగా ఈటల జమున ఇప్పటికే నామినేషన్ దాఖలుచేయగా కొద్దిసేపటి క్రితమే అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేసారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) కూడా కార్యకర్తలతో కలిసివచ్చి నామినేషన్ వేసారు. నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు కావడంతో భారీసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు.