సార్వత్రిక ఎన్నికలు .. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్

By Siva Kodati  |  First Published Jan 7, 2024, 7:37 PM IST

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. 


మరికొద్దినెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. అలాగే ప్రస్తుతం అధికారంలో వున్న తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. మంత్రులు, ముఖ్య నేతలకు ఈ బాధ్యతలు అప్పగించింది. 

ఏ నియోజకవర్గానికి ఎవరు ఇన్‌ఛార్జ్ అంటే :

  1. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల - రేవంత్ రెడ్డి
  2. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ - భట్టి విక్రమార్క
  3. ఆదిలాబాద్‌ - సీతక్క
  4. పెద్దపల్లి - శ్రీధర్‌బాబు 
  5. కరీంనగర్‌ - పొన్నం ప్రభాకర్‌
  6. నిజామాబాద్‌ - జీవన్‌రెడ్డి
  7. జహీరాబాద్ - సుదర్శన్‌రెడ్డి
  8. మెదక్‌ - దామోదర రాజనర్సింహ
  9. నల్గొండ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 
  10. భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  11. నాగర్‌కర్నూల్‌ - జూపల్లి కృష్ణారావు
  12. వరంగల్‌- కొండా సురేఖ
  13. మల్కాజ్‌గిరి - తుమ్మల నాగేశ్వరరావు
  14. ఖమ్మం - మహబూబ్‌నగర్‌ - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Latest Videos

click me!