పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగనివ్వబోం - మాజీ మంత్రి కేటీఆర్

Published : Jan 07, 2024, 05:28 PM ISTUpdated : Jan 07, 2024, 05:34 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగనివ్వబోం -  మాజీ మంత్రి కేటీఆర్

సారాంశం

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్న జిల్లాలను ప్రభుత్వం కుదిస్తే ప్రజలు ఊరుకోబోరని అన్నారు.

KTR : గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను నాయకులకు కేటీఆర్ సూచించారు.

మేం చాలా అదృష్టవంతులం.. భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం - బంగ్లాదేశ్ ప్రధాని హసీనా

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో మూడింటిలో ఒక వంతు సీట్లు గెలిచామని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైందని ఆయన విమర్శించారు.

తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుందని కేటీఆర్ అన్నారు. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఉన్న జిల్లాలను కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేస్తామని అంటున్నారని తెలిపారు. జిల్లాలను రద్దు చేస్తే ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి, వేరే వారికి టిక్కెట్ ఇచ్చి ఉంటే బాగుడేందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అలా జరగనివ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu