జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ఐదు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లు

By narsimha lodeFirst Published Nov 17, 2020, 11:47 AM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లను నియమించింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లను నియమించింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జీహెచ్ఎంసీ విస్తరించి ఉంది.దీంతో ఈ ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార తీరు తెన్నులను ఎప్పటికప్పుడు కో ఆర్డినేటర్లు పరిశీలించనున్నారు.

also read:డిసెంబర్ 1న పోలింగ్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ...

హైద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి  షబ్బీర్ అలీని నియమించారు. సికింద్రాబాద్ కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, చేవేళ్లకు పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరికి జీవన్ రెడ్డిని నియమించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆశావాహులను కోరింది. ఇప్పటికే కొందరు పీసీసీకి ధరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 19వ తేదీ నాటికి పోటీ చేసే అభ్యర్ధులను ఎంపిక చేయనుంది.అదే రోజున అభ్యర్ధులకు బీ పారాలను అందించనుంది.

అభ్యర్ధుల ఎంపిక కోసం ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడ కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుంది

ఈ ఎన్నికల్లో ప్రచార బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రచార కమిటీని కూడ కాంగ్రెస్ ప్రకటించనుంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడింది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. 


 

click me!