కామారెడ్డిలో విషాదం: పబ్జీ గేమ్‌కు యువకుడి బలి

Published : Nov 17, 2020, 11:27 AM IST
కామారెడ్డిలో విషాదం: పబ్జీ గేమ్‌కు యువకుడి బలి

సారాంశం

పబ్జీ ఆటపై మోజుతో ఓ యువకుడు  మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. పబ్జీ గేమ్ పై కేంద్రం నిషేధం విధించినా కూడ ఇతర మార్గాల ద్వారా ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకొంటున్నారు.

కామారెడ్డి: పబ్జీ ఆటపై మోజుతో ఓ యువకుడు  మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. పబ్జీ గేమ్ పై కేంద్రం నిషేధం విధించినా కూడ ఇతర మార్గాల ద్వారా ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకొంటున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజీద్ సెంటర్ కు చెందిన సాయికృష్ణ పబ్జీ గేమ్ కు బానిసగా మారాడు. ఈ గేమ్ ను కేంద్రం నిషేధించింది. అయితే థర్ట్ పార్టీ యాప్ ద్వారా కొరియన్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకొన్నాడు. 

దీని ద్వారా మళ్లీ పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. సోమవారం నాడు ఉదయం తన ఇంటిపై ఉన్న గదిలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతున్నాడు.ఈ ఆట ఆడుతూ సాయికృష్ణ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని కుటుంబసభ్యులు చెప్పారు. ఈ ఆట ఆడుతూ కుప్పకూలిపోయాడు. 

ఎంతకీ సాయికృష్ణ కిందకు రాకపోవడంతో పేరేంట్స్ గదిలోకి వెళ్లి చూశారు. గదిలో సాయికృష్ణ కుప్పకూలిన విషయాన్ని గుర్తించిన పేరేంట్స్ అతడిని ఆసుపత్రికి తరలించారు.వైద్యులు అతడిని పరిశీలించి అతను మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!