తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : 45 మందితో రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. లిస్ట్‌ ఇదే

By Siva Kodati  |  First Published Oct 27, 2023, 7:57 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా 45 మందితో కలిపి మొత్తం 100 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసినట్లయ్యింది


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్ధుల ఎంపికపై పలుమార్లు భేటీ అయి సుధీర్ఘ కసరత్తు చేసిన అనంతరం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ , కేంద్ర ఎన్నికల కమిటీ ఎట్టకేలకు రెండో జాబితాకు ఆమోదముద్ర వేసింది. తొలి జాబితాలో చోటు దక్కని పలువురు సీనియర్ నేతల పేర్లు సెకండ్ లిస్ట్‌లో అవకాశం కల్పించారు.

దివంగత పీజేఆర్ కుటుంబంలో కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ నుంచి అవకాశం కల్పించగా.. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం మొండిచేయి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయనకు బదులుగా జూబ్లీహిల్స్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు టికెట్ కేటాయించింది. రెండ్రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరోసారి మునుగోడు స్థానాన్ని కట్టబెట్టింది. 

Latest Videos

undefined

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితా - 2023 pic.twitter.com/WZp1cj3s2M

— Telangana Congress (@INCTelangana)

 

అంతకుముందు కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా 45 మందితో కలిపి మొత్తం 100 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసినట్లయ్యింది. ఇంకా 19 స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వుంది. ఈ స్థానాలకు ఆశావహులు ఎక్కువగా వుండటంతో హైకమాండ్ వీటిని పెండింగ్‌లో పెట్టింది. త్వరలోనే ఈ 19 స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించనుంది కాంగ్రెస్.

 

ఏ నియోజవర్గంలో ఎవరంటే :

  1. బోథ్ - వెన్నెల అశోక్
  2. ముథోల్ - నారాయణ్ రావు
  3. ఇబ్రహీంపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి
  4. ఎల్బీ నగర్ -  మధుయాష్కీ గౌడ్
  5. ఎల్లారెడ్డి - మధన్ మోహన్ రెడ్డి
  6. నిజామాబాద్ రూరల్ - భూపతిరెడ్డి
  7. మహేశ్వరం - కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
  8. దుబ్బాక - శ్రీనివాస్ రెడ్డి
  9. కూకట్‌పల్లి -  బండి రమేశ్ 
  10. సిర్పూర్ - రావి శ్రీనివాస్
  11. ఆసిఫాబాద్ (ఎస్టీ) - అజ్మీరా శ్యామ్
  12. ఖానాపూర్ (ఎస్టీ) - వేద్మా భోజ్జు
  13. అదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి
  14. కోరట్ల - జవ్వాది నరసింగరావు
  15. చొప్పదండి (ఎస్సీ) - మేడిపల్లి సత్యం
  16. హుజురాబాద్ - వోదిట్ల ప్రణవ్
  17. హుస్నాబాద్ - పొన్నమ్ ప్రభాకర్ 
  18. సిద్ధిపేట - పూజాల హరికృష్ణ
  19. నర్సాపూర్ - ఆవుల రాజిరెడ్డి
  20. రాజేంద్రనగర్ - కస్తూరి నరేందర్
  21. శేరిలింగంపల్లి - జగదీశ్వర్ గౌడ్
  22. తాండూర్ - బూయ్యాని మనోహర్ రెడ్డి
  23. అంబర్ పేట్ - రోహిన్ రెడ్డి
  24. ఖైరతాబాద్ - పీ. విజయా రెడ్డి
  25. జూబ్లీహిల్స్ - మొహమ్మద్ అజారుద్దీన్
  26. సికింద్రాబాద్ - వెన్నెల
  27. నారాయణపేట - డాక్టర్ పీ. చిట్టెం రెడ్డి
  28. మహబూబ్‌నగర్ - ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
  29. జడ్చర్ల - జే .అనిరుధ్ రెడ్డి
  30. దేవరకద్ర - జీ. మధుసూదన్ రెడ్డి
  31. మక్తల్ - వాకిటి శ్రీహరి
  32. వనపర్తి - జీ .చిన్నారెడ్డి
  33. దేవరకొండ - బాలు నాయక్
  34. మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  35. భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  36. జనగామ - కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
  37. పాలకుర్తి - యశస్విని మామిడిల
  38. మహబూబాబాద్ - డాక్టర్ మురళి నాయక్
  39. పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి
  40. వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి
  41. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ
  42. వర్ధన్నపేట -కేఆర్ నాగరాజు
  43. పినపాక - పాయం వెంకటేశ్వర్లు
  44. ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు
  45. పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
click me!