రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే రకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడున్నాయని అన్నారు. యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేందుకు మాత్రమే వస్తారని విమర్శించారు. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవం తెచ్చిందని చెప్పారు. సుధీర్ఘ కాలం పాటు పాలకులు విస్మరించిన వ్యవసాయానికి తిరిగి ప్రాణం పోసింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగానికి తెలంగాణ మాత్రమే అధికంగా ఖర్చు చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, ఇతర రైతు సంక్షేమ కార్యక్రమాలు కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. తెలంగాణ వరి రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో దాదాపు ఒక కోటి 70 లక్షల వరకు ధాన్యం పండుతుందని, అదంతా బాయిల్డ్ రైసేనని అన్నారు. ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ వద్దంటే ఏం చేయాలో తెలియకనే తెలంగాణ రైతాంగానికి వరి వేయొద్దని సూచించామని తెలిపారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట
undefined
తెలంగాణ రైతాంగం కోసం ఎంతో చేశామని చెప్పారు. తమకు అధికారం ఉంటే యాసంగి ధాన్యాన్ని కొనేవాళ్లమని చెప్పారు. అందుకే కుటుంబ అసవరాల కోసం, వ్యాపారులతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి వేసుకోవచ్చని తెలిపామని చెప్పారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో పిలవడం సరికాదని చెప్పారు. కేంద్రంలో పోట్లాడుకునే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో మాత్రం కలివిడిగా ఉంటున్నాయని తెలిపారు. వరి కొనుగోలు విషయంలో పార్లమెంట్ లో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీలకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిబడితే, తెలంగాణ రైతుల తరుఫున ఢిల్లీలో పోరాడాలని సూచించారు. కేంద్రం చేతిలో ఉన్న అధికారాలను ప్రశ్నించకుండా రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్
రైతులను రెచ్చగొట్టి రెండు పార్టీల నాయకులు వరి వేయాలని సూచిస్తున్నారని, కానీ ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం నాడు కూర్చుని మంగళవారం రావాలని దీక్ష చేసినట్లుంది ఆయన తీరని అన్నారు. జోనల్ సమస్యలు అన్నీ తీరిపోయాయని త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వంలో 8,72,243 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు దమ్ముంటే వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేపించాలని సవాల్ విసిరారు. ఈ ఖాళీల వివరాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్‌లో వెల్లడించిందని తెలిపారు. ప్రధానికి భయపడటానికి తామేమి బొగ్గు గనులు అమ్మలేదని అన్నారు. కార్పొరేట్లయిన ఆదాని, అంబానీలకు ఆస్తులు కూడబెట్టేందుకు సాయం చేయలేదని తెలిపారు.