పెండింగ్ ట్రాఫిక్ చలాన్లకు మంచి రెస్పాన్స్.. రాయితీ ఈ నెలాఖరు వరకే: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Siva Kodati |  
Published : Mar 25, 2022, 04:58 PM IST
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లకు మంచి రెస్పాన్స్.. రాయితీ ఈ నెలాఖరు వరకే: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సారాంశం

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ ఈ నెలాఖరు వరకే వుంటుందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఏప్రిల్ నెల నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఛార్జిషీట్లు వేస్తామని ఆయన హెచ్చరించారు. 

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై (pending traffic challan) రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ (hyderabad traffic police) జాయింట్ సీపీ రంగనాథ్ . ఇప్పటి వరకు 1.85 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయని... ఈ చలాన్ల ద్వారా రాయితీ పోగా రూ. 190 కోట్లు వసూలయ్యాయని ఆయన తెలిపారు. రోజుకు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయని సీపీ వెల్లడించారు. ఇక ఈ నెల 31 వరకే చలాన్లపై రాయితీ సదుపాయం ఉంటుందని... ఈ రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నెల నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఛార్జిషీట్లు వేస్తామని ఆయన హెచ్చరించారు. టార్గెట్లు పెట్టుకుని చలాన్లు వసూలు చేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. ఓవరాల్ గా 60 నుంచి 70 శాతం చలాన్లు క్లియర్ అవుతాయని తాము భావిస్తున్నామని రంగనాథ్ చెప్పారు.

ఇకపోతే.. హైదరాబాద్ లో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్ లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒక స్కూటర్ యజమానికి అత్యధికంగా 178 ఈ-చలాన్లు పెండింగ్ లో ఉండగా, మరో బైకర్ గరిష్ట మొత్తం రూ.73,690లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పెండింగ్లో ఉన్న ఇ-చలాన్లపై కన్సెషన్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి, ట్రాఫిక్ పోలీసులు పెండింగ్లో ఉన్న 5 కోట్ల జరిమానాలలో సుమారు 1.4 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ-చ‌లాన్ల చెల్లింపున‌కు ప్ర‌క‌టించిన ప్రత్యేక రాయితీ గ‌డువు ఈ నెలాఖ‌రున  (మార్చి 31) ముగియ‌నుంది. చ‌లాన్ల చెల్లింపున‌కు ప్ర‌త్యేక రాయితీ క‌ల్పించిన త‌ర్వాత కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న వాహ‌న‌దారుల‌పై కొరడా ఝుళిపించాలని ట్రాఫిక్ పోలీసులు  యోచిస్తున్నారు.

178 పెండింగ్ ఈ-చలాన్‌లతో కూడిన స్కూటరిస్ట్ ప్రధానంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు బుక్ చేయబడింది. ఆగస్టు 2019 నుండి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 178 చలాన్ల‌ను ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉల్లంఘించినందుకు విధించారు. పెండింగ్ లో ఉన్న చ‌లాన్ల చెల్లింపున‌కు ప్ర‌త్యేక రాయితీ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా  మార్చి 17న బోరబండ బస్టాప్‌లో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు మ‌రోసారి జ‌రిమానా విధించారు. దీంతో పెండింగ్ చ‌లాన్ల అసలు మొత్తం 48,595 అయితే, అతను కేవలం 12,490 చెల్లించడం ద్వారా అన్ని జరిమానాలను క్లియర్ చేయవచ్చునని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

గరిష్టంగా 73,690 పెండింగ్‌లో ఉన్న బైకర్‌కు ఆగస్టు 2016 నుండి అతనిపై మొత్తం 175 చలాన్‌లు ఉన్నాయి. అతని చాలా చలాన్‌లు రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు హెల్మెట్ లేకుండా రైడింగ్ చేసినందుకు సంబంధించిన‌వి ఉన్నాయి. ముఖ్యంగా ఫలక్‌నుమా, మీర్‌చౌక్ మరియు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌టంతో ఆ ఏరియా అధికారులు జ‌రిమానాలు విధించారు. పెండింగ్ చ‌లాన్లు పెరిగిపోతున్న‌ప్ప‌టికీ.. వాటిని చెల్లించ‌క‌పోవ‌డంతో 2016  డిసెంబర్ లో ఐదు లీగల్ నోటీసులు కూడా జారీ చేయబడ్డాయ‌ని అధికారులు తెలిపారు. తాజాగా తప్పుడు దిశలో ప్రయాణించినందుకు బషీర్‌బాగ్ జంక్షన్‌లో మార్చి 5న తాజా చలాన్ జారీ చేయబడింది. అయితే, అత‌ను 19,515 ఒక్కసారి చెల్లింపు చేసి.. ప్ర‌త్యేక రాయితీ స‌ద్వినియోగం చేసుకుని ఉల్లంఘ‌న‌ల‌ను క్లియ‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. 

అలాగే, ఫోర్ వీల‌ర్ విషయంలో, పెండింగ్‌లో ఉన్నఈ-చలాన్‌ల సంఖ్యకు గరిష్టంగా 80 ఉండ‌గా..  జ‌రిమానా గ‌రిష్ట మొత్తం 13,600  ఉన్నాయి. అధికంగా పార్కింగ్ ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించిన‌వి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహన యజమానిపై అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న మొత్తం 67 చలాన్‌లకు 18,175 జ‌రిమానా విధించ‌బ‌డింద‌ని తెలిపారు. మూడు చ‌క్రాల (ఆటోలు) విష‌యంలో అత్య‌ధికంగా పెండింగ్ చ‌లాన్లు 103గా ఉన్నాయి. మొత్తం జ‌రిమానా 14,085 గా ఉంది. త్రీవీల‌ర్ విష‌యంలో అత్య‌ధిక జ‌రిమానాలు రాంగ్ రూట్, పార్కింగ్‌కు సంబంధించిన‌వి ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా