
న్యూఢిల్లీ: Paddy ధాన్యం కొనుగోలు విషయమై రైతులను కేసీఆర్ కుటుంబం బలి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Kishan Reddy మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలుపై రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. BJP Farmer వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారన్నారు. Telangana నుండి FCI ఎక్కడా కూడా వడ్లు కొనని చెప్పలేదన్నారు.
బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుందన్నారు. ఏపీ,తమిళనాడు,చత్తీస్ ఘడ్ లలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో చివరి బియ్యపు గింజ వరకు కేంద్రం కొనుగోలు చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం కొనుగోలు చేయదని కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయమై ప్రజలను, రైతులను KCR తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి Piyush goyal తో తెలంగాణ మంత్రులు నిన్న భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ మంత్రులు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామో తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పీయూష్ గోయల్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీరును తెలంగాణ మంత్రులు తప్పు బట్టారు. delhi టూర్ ను ముగించుకొని వచ్చిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయింది.