ఈసీకి ఫిర్యాదు: వివాదం ఉచ్చులో మంత్రి శ్రీనివాస్ గౌడ్

By Siva KodatiFirst Published Jan 25, 2022, 6:35 PM IST
Highlights

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) వివాదంలో ఇరుక్కున్నారు. ప్రముఖ తెలుగు వార్త సంస్థ ఏబీఎన్ ప్రసారం చేసిన కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో (2018 telangana assembly elections) మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. 

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) వివాదంలో ఇరుక్కున్నారు. ప్రముఖ తెలుగు వార్త సంస్థ ఏబీఎన్ ప్రసారం చేసిన కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో (2018 telangana assembly elections) మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపాలతో వున్న మొదటి అఫిడవిట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించి.. దాదాపు నెలన్నర తర్వాత సవరించిన అఫిడవిట్‌ను అప్‌లోడ్ చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఫిర్యాదుదారు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎన్నికల కమీషన్ (election commission of india) నివేదిక తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే సీఈవో శశాంక్ గోయల్ (shashank goyal) కేంద్రానికి బదిలీపై వెళ్లడం గమనార్హం. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ.. శశాంక్ గోయల్ నివేదికలో  పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో ఈసీ విచారణ జరిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధ్రువీకరిస్తే.. ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలు తీసుకునే అవకాశం వుందని ఏబీఎన్ తన కథనంలో పేర్కొంది. 

గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ ఇప్పుడు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. 14.11.2018న మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటుకు (mahabubnagar assembly constituency) శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులతో కూడిన వివరాలతో 14.12.2018న అఫిడవిట్‌ను సమర్పించారు శ్రీనివాస్ గౌడ్. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను వెంటనే తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఈసీ. అయితే పోలింగ్ పూర్తయి , ఫలితాలు రావడానికి రెండు రోజుల మందు వెబ్‌సైట్‌లో కొత్త అఫిడవిట్ ప్రత్యక్షమైనట్లు ఏబీఎన్ తెలిపింది. 19.11.2018వ తేదీతో కొత్త అఫిడవిట్ ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను.. తెలంగాణ ఈసీ అధికారులతో కుమ్మక్కై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అప్‌లోడ్ చేయించినట్లు ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. 
 

click me!