బ్యాంక్ సర్వర్ల హ్యాకింగ్‌పై స్పందించిన మహేశ్‌ బ్యాంకు డీజీఎం.. ఏం చెప్పారంటే..

Published : Jan 25, 2022, 04:15 PM IST
బ్యాంక్ సర్వర్ల హ్యాకింగ్‌పై స్పందించిన మహేశ్‌ బ్యాంకు డీజీఎం.. ఏం చెప్పారంటే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ (AP Mahesh Cooperative Bank) సర్వర్‌లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.90 కోట్లను కొట్టేశారు. ఆ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. మహేశ్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం సర్వర్‌లోకి చొరబడిన సైబర్‌ నేరగాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు

ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ (AP Mahesh Cooperative Bank) సర్వర్‌లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.90 కోట్లను కొట్టేశారు. ఆ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. మహేశ్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం సర్వర్‌లోకి చొరబడిన సైబర్‌ నేరగాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మహేష్ బ్యాంక్ డీజీఎం బద్రినాథ్ వివరాలు తెలియజేశారు. శని, ఆది వారాలు బ్యాంకు సెలవు రోజుల్లో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను హ్యాక్ చేశారని తెలిపారు. హ్యాకింగ్‌ను గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు వేగంగా స్పందించి కొన్ని ఖాతాలను బ్లాక్‌ చేశారని తెలిపారు. సర్వర్ హ్యాక్ కావడాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఖాతాదారుల వ్యక్తిగత ఖాతాలు హ్యాక్‌ కాలేదని వెల్లడించారు. 

సర్వర్ల హ్యాకింగ్‌కు సంబంధించి బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొందరు వ్యక్తులు బ్యాంకు సర్వర్‌లను హ్యాక్ చేసి దాదాపు 100 వివిధ బ్యాంకు ఖాతాల్లో నుంచి భారీ మొత్తాలను బదిలీ చేశారు. ఇంటర్నల్ వెరిఫికేషన్‌లో మోసం వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. బ్యాంకు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ వివరాలను సేకరించారు. ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయిందో ఆ వివరాలను పరిశీలిస్తున్నారు. ఇక, మహేష్ బ్యాంక్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంతో పాటుగా.. నాలుగు రాష్ట్రాల్లో 45 శాఖలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu