ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకూ కరోనా

Published : Jun 25, 2020, 02:05 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకూ కరోనా

సారాంశం

గోషామహాల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  ఇద్దరు డ్రైవర్లకు కరోనా సోకింది. ఇప్పటికే ఆయన ఇద్దరు గన్ మెన్లకు కూడ కరోనా సోకింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  ఇద్దరు డ్రైవర్లకు కరోనా సోకింది. ఇప్పటికే ఆయన ఇద్దరు గన్ మెన్లకు కూడ కరోనా సోకింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వైద్యలు పరీక్ష నిర్వహించారు. అయితే ఆయనకు మాత్రం కరోనా సోకలేదు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. తన గన్ మెన్ కు కరోనా సోకడంతో రాజాసింగ్ తన ఇంట్లో రోజు కంటే ఎక్కువ సేపు వ్యాయామం చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను ఇటీవల విడుదల చేశాడు. ఈ వీడియోలోనే తన గన్ మెన్ కు కరోనా సోకిన విషయాన్ని ప్రకటించాడు.

తొలుత ఒక్క గన్ మెన్ కు కరోనా నిర్ధారణ అయింది. ఆ తర్వాత మరో గన్ మెన్ కు కూడ కరోనా సోకిందని వైద్యులు తేల్చారు. మరో వైపు రాజాసింగ్  వాహనానికి డ్రైవర్లుగా ఉన్న ఇద్దరు డ్రైవర్లకు కూడ కరోనా సోకింది.  

తెలంగాణ రాష్ట్రంలో  బుధవారం నాటికి కరోనా కేసులు 10,444కి చేరుకొన్నాయి. బుధవారం నాడు ఒక్క రోజే 891 కేసులు నమోదయ్యాయి.  జీహెచ్ఎంసీ పరిధిలో 719 కేసులు నమోదైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.కరోనాతో నిన్నటి వరకు 225 మంది మృతి చెందారు.
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?