ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూసేకరణ కాదు.. ప్రస్తుతం ఇచ్చిన ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ మాత్రమే: కామారెడ్డి కలెక్టర్

By Sumanth KanukulaFirst Published Jan 7, 2023, 2:33 PM IST
Highlights

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళనలు ఉధృతం అవుతుండటంతో.. ఆ ప్రాతిపాదనలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరణ ఇచ్చారు. శనివారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని చెప్పారు. 

రైతుల భూములు ఎక్కడికి పోవడం లేదని.. ఇప్పటికీ వారి పేరు మీదే ఉన్నాయని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళనలు ఉధృతం అవుతుండటంతో.. ఆ ప్రాతిపాదనలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరణ ఇచ్చారు. శనివారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని చెప్పారు. మూసాయిదాలో మార్పులు, చేర్పులు  జరుగుతాయని తెలిపారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటున్నామని చెప్పారు. రైతుల అభ్యర్థనలను అన్నింటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలుపవచ్చని ఇప్పటికే ప్రకటించామని చెప్పారు. అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కుఉందని తెలిపారు. ఇందుకు జనవరి 11 వరకు సమయం ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా వేశామని చెప్పారు. 

కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించినంతా మాత్రం.. రైతుల భూములు లాక్కున్నట్టుగా కాదని అన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూసేకరణ కాదని చెప్పారు. రైతులు భూములు పోతాయని ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. భూములు పోతాయని ఎందుకు అపోహపడుతున్నారో తెలియడం లేదని చెప్పారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమేనని అన్నారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ మూసాయిదా రూపొందించామని చెప్పారు. ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయని.. అప్పుడే పూర్తైనట్టుగా కాదని తెలిపారు. 

కామారెడ్డికి సంబంధించిన 2000 సంవత్సరం పాత మాస్టర్ ప్లాన్‌‌లో రోడ్లను కూడా చూపించారని..  ఉన్న భూములు పోలేదు కదా? అని అన్నారు. 
ఇప్పటికీ వారిపేరు మీదే భూములు ఉన్నాయని అన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించినంత మాత్రన భూసేకరణ జరగదని అన్నారు. ఇండస్ట్రీయల్ జోన్‌లో ఉన్నందువల్ల భూములు పోతాయని భయపడొద్దని చెప్పారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత సమస్యల పరిష్కారం జరుగుతుందని అన్నారు. అందరికి సమాధానపూర్వకంగా ఫైనల్ మాస్టర్ ప్లాన్ పబ్లిష్ అవుతుందని చెప్పారు. 

click me!