మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

Published : Jan 07, 2023, 01:50 PM IST
మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అన్నారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అన్నారు. కేంద్రం నిధులపై తెలంగాణ సర్కార్ తప్పుడు లేఖలు చెబుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చకు సిద్దమని ప్రకటించారు. కేంద్రం నిధులపై ఆధారాలతో సహా చూపిస్తామని అన్నారు. కేసీఆర్ రాజీనామా పత్రం పట్టుకుని చర్చకు రావాలని అన్నారు. రాజకీయాల గురించి కాదని.. అభివృద్ది గురించి మాట్లాడాలని అన్నారు. 

రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ  కింద జమ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారి ఇన్నేళ్లు గడిచినా ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం అని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం