హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యంతాగుతూ, బండబూతులు తిడుతూ...

By SumaBala Bukka  |  First Published Feb 16, 2024, 2:48 PM IST

హైదరాబాద్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఫిర్యాదు చేసినా హెసీఏ స్పందించలేదు. 


హైదరాబాద్ : మహిళా క్రికెటర్లతో క్రికెట్ కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాదులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లందరినీ బస్సులో తీసుకువెళ్తున్న కోచ్.. ఆ సమయంలో మద్యం తాగాడు. బస్సులో వెళుతున్న క్రమంలో కూడా మద్యం తాగుతూ.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.  అయితే,  అతని ప్రవర్తన పై అభ్యంతరం తెలపకుండా ఓ మహిళ సిబ్బంది కూడా మద్దతు నిలిచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత కాస్త ఆలస్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కానీ, ఇప్పటివరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది? ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. హైదరాబాద్ కు చెందిన మహిళా క్రికెటర్లు ఇటీవల విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు తమ కోచ్ జైసింహతో కలిసి ఇక్కడి నుంచి వెళ్లారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రికెటర్లంతా విమానంలో రావాల్సి ఉంది. కానీ కోచ్ జైసింహ లేట్ చేశాడు. దీంతో వారికి ఫ్లైట్ మిస్ అయింది. ఫ్లైట్ మిస్ అవ్వడంతో మహిళా క్రికెటర్లంతా టీం బస్సులో హైదరాబాద్ కి బయలుదేరారు.

Latest Videos

రూ. 3 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌..

ఆ తర్వాత తెలిసింది ఏంటంటే జైసింహ కావాలనే  ఆలస్యం చేసి ఫ్లైట్ కి వెళ్ళకుండా చేశాడని. బస్సులో వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించాడు. దీనికి ఉమెన్స్ టీం అభ్యంతరం చెప్పింది. తనకు అభ్యంతరం చెబుతారా? అంటూ ఆవేశానికి గురైన జైసింహా వారందరినీ బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెట్ టీం సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమా రావు కూడా అదే బస్సులో ఉన్నారు. మహిళా క్రికెటర్లకు మద్దతు ఇవ్వకుండా ఆమె జైసింహకు మద్దతుగా నిలిచింది. 

ఎలాగో హైదరాబాద్ చేరుకున్న తర్వాత మహిళా క్రికెటర్లందరూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులైనా ఈ ఫిర్యాదు మీద, జైసింహ మీద కానీ, పూర్ణిమ రావు మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ మీద ఫిర్యాదు చేసిన విషయం తెలిసిన కోచ్ జైసింహా మహిళా క్రికెటర్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు టీం నుంచి మహిళా క్రికెటర్లను తప్పిస్తానంటూ బెదిరించాడు. అయినా వారు భయపడలేదు. ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్న పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

click me!