బిగ్ బాస్ ఫేమ్ హారికకు షాక్: ఉప్పల శ్రీనివాస్ మీద ఆగ్రహం

Published : Mar 09, 2021, 03:14 PM ISTUpdated : Mar 09, 2021, 03:32 PM IST
బిగ్ బాస్ ఫేమ్ హారికకు షాక్: ఉప్పల శ్రీనివాస్ మీద ఆగ్రహం

సారాంశం

బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, హరికు అనూహ్యమైన షాక్ తగిలింది.

హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ హారికకు షాక్ తగిలింది. ఆమెను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్ప శ్రీనివాస్ మీద అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం వెబ్ సైట్ నుంచి హారిక వివరాలను తొలగించారు. 

సీఎంవో కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఉప్పల శ్రీనివాస్ హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలుస్తోంది. దీనిపైనే సీఎంవో కార్యాలయం అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా తెలియకుండా హారిక నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను టూజరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ టూరిజం కార్పోరేషన్ కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు ఆయన నియామకం పత్రాన్ని కూడా అందజేశారు. తన నియామకం పట్ల హారిక ఆనందం కూడా వ్యక్తం చేశారు.

హరిక నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్తాను సంజాయిషీ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తమకేమీ తెలియదని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే